జయ ఆశలపై సుప్రీం నీళ్లు

21 Feb, 2014 01:50 IST|Sakshi

రాజీవ్ హంతకుల విడుదలకు బ్రేక్
 న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల తక్షణ విడుదలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో బ్రేక్ పడింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానపరమైన లోపాలను ఎత్తిచూపిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. తాము శిక్ష తగ్గించిన ముగ్గురు దోషులు మురుగన్, శంతన్, పెరారి వాలన్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు జైలు ఉన్నతాధికారులు, ఇతరులకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ హత్య కేసులో ముగ్గురు దోషులకు పడిన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ సుప్రీం తీర్పు వెలువరించిన 24 గంటల్లోగానే ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఏడుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయూలని జయలలిత సర్కారు నిర్ణయం తీసుకుంది.
 
 దీనిపై స్టే కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచింది. ఈ నేపథ్యంలో స్టే మంజూరు చేసిన బెంచ్ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌లో కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే పేర్కొన్నందున శిక్ష మాఫీ పొందిన మిగతా న లుగురి విషయంలో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీంతో మొత్తం ఏడుగురు దోషుల విడుదలకు బ్రేక్ పడినట్టరుుంది.   తదుపరి విచారణను మార్చి 6కు వారుుదా వేసింది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఒక్కరోజులోనే తమిళనాడు ప్రభుత్వం విధానపరమైన చర్యలన్నిటినీ ఎలా పూర్తి చేయగలిగిందని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎన్.వి.రమణలతో కూడిన బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది.
 
 దేశ అంతరాత్మపై దాడి: ప్రధాని
 రాజీవ్ హత్య భారతదేశ అంతరాత్మపై జరిగిన దాడిగా ప్రధాని మన్మో హన్‌సింగ్ అభివర్ణించారు. రాజీవ్ హంతకుల విడుదల అన్ని న్యాయ సూత్రాలకూ విరుద్ధమన్నారు. న్యాయపరంగా సమర్థనీయం కాని విషయంలో ముందుకువెళ్లరాదని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు