వీళ్లకు పద్మాలివ్వండి

24 Sep, 2015 03:10 IST|Sakshi

- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు..హోంశాఖకు చేరిన జాబితా
- భారతరత్నకు ఎన్టీఆర్‌ను ప్రతిపాదించని బాబు సర్కార్

సాక్షి, న్యూఢిల్లీ:
ఈనాడు పత్రికాధిపతి సీహెచ్.రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే భారతరత్న పురస్కారం విషయంలో ఎన్టీఆర్‌కు మళ్లీ మొండి చేయి చూపింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు అవకాశం ఉన్నా ఆ అవార్డుకు ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేయలేదు. రాష్ట్రం నుంచి 30 మంది పేర్లతో పద్మ అవార్డుల జాబితా వచ్చిందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. పద్మ విభూషణ్ అవార్డుకు రామోజీరావుతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్.నాగేశ్వర రెడ్డి పేరును కూడా రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సు చేసిందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పద్మ విభూషణ్‌కు ఇద్దరి పేర్లను, పద్మ భూషణ్‌కు ఐదుగురి పేర్లను, పద్మ శ్రీ అవార్డులకు 23 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాల వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
 
పద్మవిభూషణ్‌కు..: సీ.హెచ్. రామోజీరావు (జర్నలిస్టు), డాక్టర్ నాగేశ్వర రెడ్డి (గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్).
పద్మ భూషణ్‌కు: డాక్టర్ అనంద శంకర్ జయంత్ (కూచిపూడి నృత్యం), డాక్టర్ బాల వి.బాలచందర్ (విద్య), చాగంటి కోటేశ్వరరావు( సాహిత్య, సంస్కృతి), డాక్టర్ ఎం.గోపిచంద్ (సామాజిక సేవ), ఎం. మురళీ మోహన్ (ఎంపీ, ఆర్ట్ అండ్ సామాజిక సేవ).
 
పద్మ శ్రీకి: డి.హారిక (చెస్), కె. శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), ఎం. వెంకటేశ్వర యాజులు (సాహిత్య-విద్య), ముదిగొండ శివప్రసాద్ (సాహిత్యం), ఎ. ప్రకాశరావు (సాహిత్యం), అంబిక (కూచిపూడి నృత్యం), వందేమాతరం శ్రీనివాస్ (గాయకుడు), జి. రమణయ్య (చేనేత), పూజ కపూర్ (మ్యూజిక్), డాక్టర్ జయప్రద రామమూర్తి (ఫ్లూట్), జి.రాజేంద్రప్రసాద్ (సినిమా), కీర్తి శేషులు వేటూరి సుందరరామ్మూర్తి (రచయిత), పసుమర్తి రత్తయ్య శర్మ (కూచిపూడి నృత్యం), యార్లగడ్డ నాయుడమ్మ (వైద్యం), డాక్టర్ విశ్వరూపరెడ్డి (ఈఎన్‌టి సర్జన్), డాక్టర్ ముక్కామల అప్పర (ఎన్‌ఆర్‌ఐ-రేడియాలజీ), డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు (కార్డియాలజీ), డాక్టర్ టి. దశరథరామిరెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ సీ.హెచ్. మోహన్ వంశీ (అంకాలజీ), డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు (అంకాలజీ), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలె (సి.టి. సర్జన్), అక్షయ క్షేత్రం (సామాజిక సేవ), వి. శ్రీదేవి (హార్టికల్చర్)ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.

>
మరిన్ని వార్తలు