ఎన్ఐసీ సమావేశం నుంచి చంద్రబాబు వాకౌట్

23 Sep, 2013 15:48 IST|Sakshi
ఎన్ఐసీ సమావేశం నుంచి చంద్రబాబు వాకౌట్

జాతీయ సమైక్యత మండలి (ఎన్ఐసీ) సమావేశం నుంచి టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారు. సోమవారం ఢిల్లీలో ఆరంభమైన ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు ఆంద్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్య గురించి చర్చించేందుకు ఎన్ఐసీ వేదిక కాదని చెప్పారు.

కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్ కుమార్ కూడా చంద్రబాబు తెలంగాణ సమస్యను ప్రస్తావించడాన్నివ్యతిరేకించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, మత ఘర్షణల గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు తెలంగాణ సమస్య ప్రస్తావించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఐతే తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సమావేశంలో ఉండనని చెప్పిన చంద్రబాబు వాకౌట్ చేశారు.

మరిన్ని వార్తలు