అసెంబ్లీలో మీడియా కష్టాలు

18 Feb, 2017 12:48 IST|Sakshi
అసెంబ్లీలో మీడియా కష్టాలు
తమిళనాడు అసెంబ్లీలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విధ్వంసం ఏర్పడింది. దాంతో అదేదీ ప్రెస్ గ్యాలరీలోకి వినిపించకుండా ఉండేందుకు గ్యాలరీలో ఉన్న స్పీకర్ కనెక్షన్‌ను స్పీకర్ కట్ చేశారు. డీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించారు. దీంతో స్పీకర్ కుర్చీ, మైకు విరిగిపోయాయి. సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియపై ప్రతిపక్షం డీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 
 
ఆ విషయాలేవీ మీడియాకు ఎక్కకుండా ఉంటే మంచిదని భావించిన స్పీకర్ ధనపాల్.. ప్రెస్ గ్యాలరీలో ఉన్న స్పీకర్‌ కనెక్షన్ తీసేశారు. దాంతో మీడియా వర్గాలకు అసలు సభలో ఏం జరుగుతోందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే సభలో కొంతమంది సభ్యలు బెంచీలు ఎక్కి నిలబడటం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం లాంటివి మాత్రం కళ్లకు స్పష్టంగా కనిపించాయి. 

 

మరిన్ని వార్తలు