తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా

31 Dec, 2016 19:07 IST|Sakshi
తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా
హైదరాబాద్: అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) నూతన అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చారు సిన్హాను నియమిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ పదవిలో కొనసాగుతున్న ఏకే ఖాన్‌ (డిసెంబర్‌ 31న) రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారు సిన్హా ప్రస్తుతం అదే విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
పదవీ విరమణ చేయనున్న ఏకే ఖాన్(1981 ఐపీఎస్‌ బ్యాచ్‌)‌.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోట్లు సహా పలు కీలకమన కేసులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఈ-ఆఫీసు, లీగల్‌ సెల్‌, సైబర్‌సెల్‌ ఏర్పాటుచేసి దేశంలోనే తొలి సాంకేతిక హంగులు గల ఏసీబీ ఆఫీసుగా తెలంగాణ ఏసీబీ ఆఫీసును తీర్చిదిద్దడంలో ఖాన్‌ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు.
మరిన్ని వార్తలు