తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి

20 Jul, 2015 02:36 IST|Sakshi
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి

4.5 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారు: గండ్ర
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసగించినందుకు తలసానిపై సుమోటోగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
 
 ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర మీడియాతో మాట్లాడుతూ తలసాని రాజీనామాకు సంబంధించి తమకు మొదటి నుంచి అనుమానం రావడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా అసలు విషయం బయటపడిందన్నారు. రాజీనామా లేఖ ఇవ్వకుండానే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చేత రాజీనామా చేయించకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఏ రకమైన ఆదర్శ పాలనవుతుందని ఎద్దేవా చేశారు.
 
 తలసానిపై 420 కేసు పెట్టాలి: షబ్బీర్
 రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు మంత్రి తలసానిపై తక్షణమే సుమోటోగా 420 కేసు నమోదు చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీని తలసాని అవమానపరిచారని మండిపడ్డారు. తలసాని దుశ్చర్యపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చకు పట్టుబడుతామన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు.
 
  సీఎం ఓవైపు నీతి వాక్యాలు వల్లిస్తూ మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ నరసింహన్ పాత్రపైనా అనుమానం కలుగుతోందని షబ్బీర్ పేర్కొన్నారు. తలసాని రాజీనామా చేశారా లేదా అని గవర్నర్ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు నిజాయితీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగరాదన్నారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి