తీరంలో 90శాతం ఆయిల్‌ తొలగింపు...!

4 Feb, 2017 13:11 IST|Sakshi
తీరంలో 90శాతం ఆయిల్‌ తొలగింపు...!

చెన్నై: సముద్రతీరంలో గతవారం రోజులుగా పేరుకుపోయిన ముడిచమురు వ్యర్థాలలో 90శాతాన్ని తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 65 టన్నుల ముడిచమురు రొంపిని శుభ్రపరిచినట్టు వెల్లడించింది. త్వరలోనే తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. చెన్నైకి సమీపంలోని సముద్ర తీరంలో సముద్రంలో భారీగా ముడిచమురు రొంపి పేరుకుపోవడంతో ఒక్కసారి పర్యావరణ ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. తొలిగించిన ముడిచమురు రొంపిని సురక్షితంగా తరలించేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ జీవ ప్రతిక్రియాత్మక చర్యలు తీసుకుంటున్నది.

కేంద్రమంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌ శనివారం ఎన్నోర్‌ తీరప్రాంతాన్ని సందర్శించి.. చమురు రొంపి తొలగింపు పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఎన్నోర్‌  తీరప్రాంతంలోనే ముడిచమురు రొంపి పేరుకుపోయి ఉందని, దీనిని రానున్న రెండురోజుల్లో తొలగించేస్తారని తెలిపారు. మనుష్యులే తొలగింపు పనుల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఈ పనుల్లో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు