వేల అడుగుల ఎత్తు, రూ. వందల కోట్ల ఖర్చు!

8 Jan, 2017 11:17 IST|Sakshi
వేల అడుగుల ఎత్తు, రూ. వందల కోట్ల ఖర్చు!

చైనాలో ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్‌

బీజింగ్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్‌ను చైనా నిర్మిస్తోంది. ఈ టెలిస్కోప్‌ను భారత సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో నెలకొల్పుతుంది. దీని నిర్మాణానికి దాదాపుగా రూ.128.14 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నిర్మాణం పూర్తయితే అంతరిక్షం నుంచి వస్తోన్న భారీ శబ్దాల వెనుక మర్మాన్ని తెలుసుకోవచ్చని చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ముఖ్య పరిశోధకుడు యో యాంకైంగ్‌ చెప్పారు. సముద్రమట్టానికి 5,250 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఈ భారీ ప్రాజెక్టును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఎనర్జీ ఫిజిక్స్‌, షాంగై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోసిస్టమ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సౌజన్యంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టెలీస్కోప్‌ 2021కి అందుబాటులోకి రానుందని వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు