ఒలింపిక్స్కు మేజర్ స్పాన్సర్ ఆ కంపెనీనే!

19 Jan, 2017 20:28 IST|Sakshi
ఒలింపిక్స్కు మేజర్ స్పాన్సర్ ఆ కంపెనీనే!
ఏదైనా మేజర్ ఈవెంట్ నిర్వహించాలంటే దానికి కచ్చితంగా స్పాన్సర్స్ అవసరం. ఇటు స్పాన్సర్ కూడా తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవడానికి ఈవెంట్లను బాగా వాడుకుంటుంటాయి. ఒలింపిక్స్ లాంటి వరల్డ్ ఈవెంట్లకు ప్రధాన స్పాన్సర్గా చేజిక్కించుకోవడం అంటే మాటలా! అలాంటి ఈ ఒలింపిక్స్కు ప్రధాన స్పాన్సర్గా చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సొంతంచేసుకుంది. ఈ మేరకు ఇంటర్నేషన్ ఒలంపిక్ కమిటీ(ఐఓసీ)తో 2028 వరకు ఒలంపిక్ గేమ్స్కు ప్రధాన స్పాన్సర్గా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఐఓసీ, అలీబాబా గురువారం వెల్లడించాయి.
 
అధికారికంగా అలీబాబా ఈ-కామర్స్, క్లౌడ్ సర్వీసు పార్టనర్తో పాటు12 ఇతర కంపెనీలు కూడా ఈసారి నిర్వహించబోయే ఒలంపిక్స్కు టాప్ స్పాన్సర్లగా ఉన్నట్టు ఇవి పేర్కొన్నాయి.. ఈ కంపెనీల్లో కోకా-కోలా, మెక్డొనాల్డ్స్ ఉన్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ స్పానర్షిప్ను అలీబాబా దక్కించుకున్నందో మాత్రం ఇవి వెల్లడించలేదు. ఐఓసీ వర్గాల ప్రకారం ప్రధాన స్పాన్సర్గా నిర్వహించేవారు ప్రతి నాలుగేళ్ల కాలానికి 100 మిలియన్ డాలర్లు(రూ.681కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనిలోనే ఒక సమ్మర్, ఒక వింటర్ గేమ్స్ కలిసి ఉంటాయి. డిజిటల్ వరల్డ్లో ఇదో చరిత్రాత్మకమైన ఒప్పందమని ఐఓఎస్ ప్రెసిడెంట్ థామస్ బాచ్ తెలిపారు. ఒలింపిక్ మూమెంట్ను సమర్థవంతమైన సాంకేతిక రూపంలో ప్రదర్శించగలుగడానికి ఈ డీల్ ఎంతో సహకరిస్తుందని ఐఓసీ ఆశిస్తోంది. ఇటు కంపెనీకి ఇది ఎంతో సహకరిస్తుందని అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా తెలిపారు.   
 
 
మరిన్ని వార్తలు