ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది

3 Sep, 2016 17:35 IST|Sakshi
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది

బీజింగ్ :  చైనాలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్   బ్రిడ్జ్  మూత పడింది.  ఆగ‌స్టు 22న  ప్రారంభమైన  గ్లాస్ వంతెనను   కేవలం 13రోజుల్లో  మూసివేశారు.  మెయింటినెన్స్  కారణాల రీత్యా మూసివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అత్యవసరంగా నిర్వహించాల్సిన మెయిన్‌టెనెన్స్  పనుల కోసం బ్రిడ్జ్‌ను మూసివేస్తున్నట్టు  అధికారిక ప్రకటనలో  పేర్కొన్నారు.  పునః ప్రారంభ సమయాన్ని మళ్లీ ప్రకటిస్తామని  అధికారులు  ప్రకటించారు.


హున‌న్ ప్రావిన్స్‌లో రెండు కొండ‌ల మ‌ధ్య ఉన్న ఈ అతి ఎత్తైన‌, అతి పొడువైన గ్లాస్ బ్రిడ్జ్‌ (430 మీ. పొడవు) ప్రపంచంలో అతి పెద్ద గాజు వంతెనగా పేరొంది.  బ్రిడ్జ్‌ను ప్రారంభించిన త‌ర్వాత టూరిస్టుల తాకిడి మ‌రింత పెరగడంతో ఈ నిర్ణయ తీసుకున్నట్టు తెలుస్తోంది.  ప్రతి రోజు 8 వేల మంది టూరిస్టులను త‌ట్టుకునే శ‌క్తి బ్రిడ్జ్‌కు ఉంది. కానీ రికార్డు స్థాయిలో అత్యధిక  సంఖ్యలో   సుమారు  10 రెట్ల ప‌ర్యాటకుల తాకిడి పెరగడంతో తక్షణమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

 మరోవైపు ఈ  ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో   నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 'తాము ప్రతిదీ బుక్ చేసుకున్నామని,  ఇప్పుడు  మూసివేశామంటున్నారు. ..తమాషా చేస్తున్నారా?  తదితర  కమెంట్లు వెల్లువెత్తాయి.


 

మరిన్ని వార్తలు