ఆ యువకులకు... గ్యాంగ్రేప్తో సంబంధం లేదు!

20 Nov, 2013 10:39 IST|Sakshi

బీజింగ్లోని హోటల్లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనతో ప్రముఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన మేజర్ జనరల్ జెన్లీ షౌజియాంగ్ కుమారుడు లీ తియానికి ఎటువంటి సంబంధం లేదని డిపెన్స్ న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలిపారు. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన శిక్ష పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ శిక్షను వెంటనే రద్దు చేయాలని డిఫెన్స్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

 


సామూహిక అత్యాచార కేసులో శిక్ష పడిన ఇద్దరు యువకులు అమాయకులని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బీజింగ్లో నెంబర్1 ఇంటర్మీడియట్ కోర్టులో సామూహిక అత్యాచార కేసుపై మంగళవారం రెండవ సారి విచారణ జరిగింది. ఈ సందర్బంగా లీ తియానిక తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను పైవిధంగా వినిపించారు.



ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్లోని ప్రముఖ హోటల్లో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన చైనాను అతలాకుతలం చేశాయి. ఆ దుశ్చర్యకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి, శిక్ష విధించాలని చైనీయులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు. ఆ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో షౌజియాంగ్ కుమారుడు లి తియాని, మరో యువకుడు నిందితులని పోలీసులు నిర్ధారించారు.

 

ఆ క్రమంలో సెప్టెంబర్ 26న బీజింగ్ హైడియన్ జిల్లా కోర్టు లి తియానికి 10 ఏళ్ల, మరో యువకుడికి 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దాంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ఎగువ కోర్టును ఆశ్రయించారు. అయితే చైనా ఆర్మీ అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్లో లి తియాని తండ్రి షౌజియాంగ్ ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు