ట్రంప్ తో భేటీకానున్న అగ్రనేత

30 Mar, 2017 17:45 IST|Sakshi
ట్రంప్ తో భేటీకానున్న అగ్రనేత

బీజింగ్: రెండు అగ్రదేశాల అధినేతలు వచ్చే వారం భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సమావేశం కానున్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా పర్యటనకు ముందు ఫిన్ లాండ్ కు వెళతారని తెలిపారు. 

ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఫిన్ లాండ్ లో జిన్‌పింగ్‌ పర్యటిస్తారని చెప్పారు. 6, 7 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో పర్యటిస్తారని తెలిపారు. ఫోర్లిడా మార్-ఏ-లాగోలో ఉన్న ట్రంప్ వ్యక్తిగత నివాసంలో ఆయనతో జిన్‌పింగ్‌ సమావేశమవుతారు. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై ఇరువురు నాయకులు చర్చించే అవకాశముంది.

'అమెరికాతో వర్తక భాగస్వామం పెంపొందించుకోవాలని చైనా కోరుకుంటోంది. చర్చల ద్వారా వాణిజ్య, వర్తక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామ'ని లుకాంగ్ పేర్కొన్నారు. 2016లో రెండు దేశాల మధ్య 519.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు