మళ్లీ క్రిస్‌ గేల్‌ వచ్చేశాడు!

5 Jul, 2017 11:59 IST|Sakshi
మళ్లీ క్రిస్‌ గేల్‌ వచ్చేశాడు!

వెస్టిండీస్‌ టాప్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు మళ్లీ పిలుపు అందింది. భారత్‌తో జరగనున్న ట్వంటీ-20 మ్యాచ్‌ కోసం విండీస్‌ జట్టులోకి అతన్నీ మళ్లీ తీసుకున్నారు. ఈ నెల 9న కింగ్‌స్టన్‌లోని సెబినా పార్క్‌లో ఈ టీ-20 మ్యాచ్‌ జరగనుంది.

జమైకన్‌ ఓపెనర్‌ అయిన గేల్‌ చివరిసారిగా 2016 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ను ఓడించి టీ-20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకున్న వెస్టిండీస్‌ జట్టులో అతను కూడా సభ్యుడిగా ఉన్నాడు. పొట్టిక్రికెట్‌ ఫార్మెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వెస్టిండీస్‌ ఆటగాడిగా గేల్‌కు రికార్డు ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో టీ-20 క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా గేల్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంటున్నట్టు వెస్టిండీస్‌ సెలక్టర్ల బోర్డు చైర్మన్‌ కౌర్ట్నీ బ్రౌన్‌ తెలిపాడు. టీ-20 ఫార్మెట్‌లో గేల్‌ అత్యంత నిపుణుడైన ఆటగాడని, అందుకే తమ జట్టు టాప్‌ ఆర్డర్‌ బలం చేకూర్చేందుకు అతన్ని జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. వెస్టిండీస్‌ టీ-20 జట్టు ఇలా ఉండనుంది.

జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), శామ్యూల్ బద్రీ, రాన్స్ఫోర్డ్ బీటన్, క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, జాసన్ మొహమ్మద్, సునీల్ నరేన్‌, కీరన్ పొల్లార్డ్, రోవ్మన్ పావెల్, మార్లోన్ శామ్యూల్స్, జెరోమ్ టేలర్, చాడ్విక్ వాల్టన్ (వికెట్‌ కీపర్‌), కేస్క్ విలియమ్స్.

మరిన్ని వార్తలు