కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

12 Jun, 2015 04:10 IST|Sakshi
కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

సీఐఎస్‌ఎఫ్ జవాను మృతి, మరొకరికి గాయాలు
కోజికోడ్(కేరళ): కోజికోడ్ దగ్గర్లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఇది కాల్పులకు దారితీయడంతో ఓ జవాను మృతిచెందాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణతో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు.

ఈ పరిణామాలపై కేరళ హోంమంత్రి రమేశ్ విచారణకు ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన అగ్నిమాపకదళ అధికారిని సోదా చేసే క్రమంలో తలె త్తిన వాదన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీఐఎస్‌ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ జైపాల్ యాదవ్ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన తర్వాత సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది లాఠీలతో ప్రయాణికులను కొట్టి, విమాన సర్వీసులను అడ్డుకున్నారని సాక్షులు తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు