ప్రతిభ ఆధారంగానే చీఫ్ జస్టిస్ ఎంపిక

24 Aug, 2014 16:03 IST|Sakshi
ప్రతిభ ఆధారంగానే చీఫ్ జస్టిస్ ఎంపిక

న్యూఢిల్లీ: ప్రతిభ ఆధారంగా భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగాలని సీనియారిటి ప్రాతిపదికన కాదని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. సీనియారిటి ఉన్న వారికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఇవ్వాలని రాజ్యాంగబద్దమైన లేదా శాసనసంబంధమైన నిబంధన ఏదీ లేదని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిభ కనబరిచిన వారిని నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఆయన సూచించారు.

సీజేఐ నియామకానికి అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలు న్యాయవ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయని కట్జూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఏం లోదా- సెప్టెంబర్ 27న పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా