కాబోయే ప్రధానమంత్రి యోగినే!

25 Mar, 2017 11:39 IST|Sakshi
కాబోయే ప్రధానమంత్రి యోగినే!
  • 2024లో ఆయనకే దేశ పగ్గాలు
  • గోరఖ్‌పూర్‌లో మిన్నంటిన ఆకాంక్ష
  • నేడు తొలిసారిగా స్వస్థలానికి  యూపీ సీఎం

  • ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్‌ శనివారం తన స్వస్థలం గోరఖ్‌పూర్‌ వెళ్లబోతున్నారు. సీఎం హోదాలో యోగి తొలిసారి గోరఖ్‌పూర్‌ వస్తుండటంతో ఆయన అభిమానుల సందోహం మిన్నంటింది. గోరఖ్‌పూర్‌ మొత్తం యోగి కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లతో కాషాయమయంగా మారింది. అంతేకాదు '2024లో ప్రధానమంత్రి యోగి' కావాలన్న ఆకాంక్ష, డిమాండ్‌ ఇక్కడ ప్రముఖంగా తెరపైకి రావడం గమనార్హం.

    యూపీ సీఎం యోగి నివాస ప్రదేశమైన గోరఖ్‌నాథ్‌ ఆలయానికి శనివారం ఉదయం నుంచే వేలమంది మద్దతుదారులు తరలివస్తున్నారు. సీఎం యోగిని చూడాలన్న ఉబలాటం వారిలో కనిపిస్తోంది. ఈ ఆలయానికి వచ్చిన పలువురు మద్దతుదారుల్ని మీడియా కదిలించగా.. చాలామంది నోటినుంచి భావి ప్రధాని యోగియే అన్న అభిప్రాయం వినిపించింది. 'యోగి చేసిన పనే ఆయనను ఈ స్థాయికి చేర్చింది. 2024లో యోగియే దేశ ప్రధాని కావాలని మేం కోరుకుంటున్నాం' అని గోరఖ్‌పూర్‌ స్థానికుడొకరు తెలిపారు.

    పరిశ్రుభత, పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే యోగి స్థానికంగా మంచి ప్రజాప్రతినిధిగా పేరుతెచ్చుకున్నారు. మోదీలాగే యోగి కూడా హార్డ్‌వర్కర్‌ అని, కాబట్టి ఆయన 2024లో ప్రధాని పదవికి సరితూగుతారని అంటున్నారు. ఇక, యోగి జన్మస్థలమైన పూర్వాంచల్‌ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. తమ ప్రాంతానికి చెందిన యోగి సీఎం కావడంతో పూర్వాంచల్‌ అభివృద్ధి బాట పడుతుందని ఆ ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు