2000 నోటుపై అప్పుడే నిర్ణయం..

10 Jan, 2017 12:01 IST|Sakshi
2000 నోటుపై అప్పుడే నిర్ణయం..

ముంబై: రెండు వేల రూపాయల నోట్లను చెలామణిలోకి తేవాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గతేడాది మే నెలలోనే నిర్ణయం తీసుకుంది. అయితే పాత పెద్ద నోట్లను రద్దు విషయం అప్పుడు ప్రస్తావనకు రాలేదని వెల్లడైంది. సమాచార హక్కు చట్టం కింద ‘ఇండియన్‌ ఎక్స్ ప్రెస్’  సమర్పించిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.

రూ.2000 నోట్లు ప్రవేశపెట్టేందుకు సెంట్రల్ బోర్డు 2016, మే 19న ఆమోదం తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ సమావేశంలో పాత పెద్ద నోట్ల రద్దు ప్రస్తావనే రాలేదని తెలిపింది. జూలై 7, ఆగస్టు 11న జరిగిన బోర్డు సమావేశాల్లోనూ పాత పెద్ద నోట్ల ఉపసంహరణపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేసింది.

రఘురామ్‌ రాజన్ గవర్నర్‌ గా ఉన్నప్పుడే రూ. 2000 నోట్లు ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సెంట్రల్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది సెప్టెంబర్‌ 4న రాజన్‌ వైదొలగారు. తర్వాత రోజు ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని వార్తలు