ఈవీఎంలపై సీఎం సందేహం

14 Mar, 2017 16:16 IST|Sakshi
ఈవీఎంలపై సీఎం సందేహం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈవీఎంలపై సందేహం వ్యక్తంగా చేయగా.. తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వరం కలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని కోరుతూ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మద్దతు పలికారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించవద్దని, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మాకెన్ కోరారు. ఉత్తప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రతి ఓటు బీజేపీకి పడేలా ఈవీఎంలను టాంపరింగ్ చేశారని, దీని వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాయావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు ఈవీఎంలను పరిశీలించేందుకు అభ్యర్థులను అనుమతించామని పేర్కొంది.   
 

>
మరిన్ని వార్తలు