బొగ్గు కుంభకోణం ‘అపురూపం’

3 Sep, 2013 06:25 IST|Sakshi

 న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సోమవారం రాజ్యసభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జీరోఅవర్‌లో ప్రకాశ్ జవదేకర్(బీజేపీ) బొగ్గు కుంభకోణం ‘అపురూపమైన’దంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. బొగ్గు కేటాయింపుల ఫైళ్లకు తాను కాపలాదారును కాదని ఇటీవల రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దుయ్యబట్టారు. ప్రధాని ఫైళ్లకే కాదు, దేశానికి కూడా కాపలాదారు వంటివారే. కానీ ఆయన ఈ రెంటిలో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తిం చడం లేదని జవదేకర్ అన్నారు. దీనిపై ప్రధాని సవివర ప్రకటన చేయాలని పట్టుబట్టారు.
 

మరిన్ని వార్తలు