'మెమన్ కు క్షమాభిక్ష పెట్టండి'

29 Jul, 2015 17:30 IST|Sakshi
'మెమన్ కు క్షమాభిక్ష పెట్టండి'

న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఈ నెల ఆరంభంలో ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని న్యాయ కమిషన్ కు కలాం తెలిపారని గుర్తు చేశారు.

మానవతా దృక్పథంతో మెమన్ కు ప్రాణభిక్ష పెట్టి అతడికి కొత్త జీవితం ప్రసాదించాలని రాష్ట్రపతిని గాంధీ అభ్యర్థించారు. తొందరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మెమన్ కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవాల్సివుంది.

మరిన్ని వార్తలు