దేశ ఆర్ధిక స్థితిపై శ్వేత పత్రం తేవాలి

26 May, 2017 11:38 IST|Sakshi

ఎన్డీయే మూడేళ్ల పాలనపై కాంగ్రెస్‌ డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రచారం మినహా సాధించిందేమీ లేదని ఆరోపిస్తూ ఆర్ధికస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మూడేళ్ల ఎన్డీయే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మూడేళ్ల పాలనపై ప్రచారానికి ఖజానా నుంచి కోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ ఆరోపించారు. మూడేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూడేళ్లలో ఆర్దికాభివృద్ది లేదని, పాత పద్దతిని మార్చి జీడీపీ గణాంకాలను తయారు చేసి ఎంతో అభివృద్ది సాధించామని గొప్పలు చెబుతున్నారన్నారు. దేశంలోకి పెట్టుబడులు రావడం లేదన్నారు. అధికారంలోకొస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని, గత మూడేళ్లలో కేవలం 1.5 లక్షల ఉద్యోగాలే ఇచ్చారన్నారు. యువతకి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాజకీయ విరోధులను అవమానాల పాలు చేయడం ఈ మూడేళ్లలో పరిపాటి అయిందని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు