ఎమ్మెల్యేని, నాకూ గొర్రెలున్నాయ్‌.. కానీ..

20 Jun, 2017 20:45 IST|Sakshi
ఎమ్మెల్యేని, నాకూ గొర్రెలున్నాయ్‌.. కానీ..

- గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

జగిత్యాల అగ్రికల్చర్:
‘నేను ఎమ్మెల్యేనే.. అయినాకూడా ఓ వైపు వ్యవసాయం చేస్తూ మరో వైపు గొర్రెలు పెంచుతున్నా. ప్రస్తుతం నా దగ్గర 400 గొర్రెలు ఉన్నాయి. కానీ ఏం లాభం? గొర్రెలు కాచేందుకు మనుషులు దొరకని పరిస్థితి’ అని గొర్రెల పెంపకంలో కష్టాలను వివరించారు సీఎల్పీ ఉప నేత టి. జీవన్‌రెడ్డి.

జగిత్యాల మండలంలోని కన్నాపూర్‌ గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసిన సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నా గొర్రెల కాపరికి రూ. 60 వేల జీతం ఇస్తున్నా. ఏదైనా పనిఉందని గొర్రెలకాపరి పనిలోకి రాకుంటే కష్టమే! నేనైతే గొర్రెల వెంబడి పోనుకదా! ముందుముందు ఇదే సమస్య మీకూ(లబ్ధిదారులకు) ఎదురుకాబోతోంది. జీవాలకు వచ్చే వ్యాధులు గురించి జర జాగ్రత్త వహించండి. లేదంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమోగానీ మీరు ఇంట్లో నుంచి కట్టిన డబ్బులు  పోయే పరిస్థితి ఉంటంది’ అన్నారు. ఇలా జీవన్‌రెడ్డి మాట్లాడుతుండగా సభలో నవ్వులు పూశాయి.

మరిన్ని వార్తలు