'కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి'

7 Nov, 2015 15:07 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరపున శ్రీహరి ప్రచారం చేశారు.

కడియం శ్రీహరి ఎన్నికల నిబంధలను ఉల్లంఘించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రచారం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కడియంపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

మరిన్ని వార్తలు