'రాహుల్పై రాజకీయ గూఢచర్యం'

14 Mar, 2015 13:47 IST|Sakshi
'రాహుల్పై రాజకీయ గూఢచర్యం'

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు రాజకీయ గూఢచర్యానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ శనివారం న్యూఢిల్లీలో ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థుల జీవితాల్లోకి చొరబడ్డం, వారిపై నిఘా పెట్టడం గుజరాత్ మోడల్ కావొచ్చు కానీ భారతీయ మోడల్ కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ మహిళపై అనధికారికంగా నిఘా పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్నూప్ గేట్ వ్యవహారంపై అప్పటి యూపీఏ ప్రభుత్వం జ్యూడిషియల్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శనివారం 'గుజరాత్ మోడల్' అని ఈ విషయాన్ని గుర్తు చేసింది.

>
మరిన్ని వార్తలు