అధికారానికి రెండు సీట్ల దూరంలో..!

8 May, 2015 15:58 IST|Sakshi
అధికారానికి రెండు సీట్ల దూరంలో..!

డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ మరోసారి బ్రిటిష్ అధికార పగ్గాలను చేపట్టేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. మరొక్క రెండు సీట్లు సాధిస్తే చాలు.. ఆ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చేసినట్లే. మొత్తం 650 సీట్లున్న బ్రిటిష్ పార్లమెంటులో అధికారం కావాలంటే సగం కంటే ఒకటి ఎక్కువ సీట్లు రావాలి. అంటే, 326 అన్నమాట. ఇప్పటివరకు మొత్తం 639 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడగా, అందులో కన్సర్వేటివ్ పార్టీ 324 స్థానాల్లో విజయం సాధించింది. మరో 11 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. వాటిలో రెండు స్థానాలను గెలుచుకుంటే చాలు.. సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టవచ్చు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికి కేవలం 228 సీట్లలో మాత్రమే గెలిచింది. అనూహ్యంగా స్కాటిష్ నేషనల్ పార్టీ అనే చిన్న పార్టీ విజృంభించి 56 చోట్ల గెలవడంతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ పడింది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు  ఇలా ఉన్నాయి.

కన్జర్వేటివ్ పార్టీ 324
లేబర్ పార్టీ 228
స్కాటిష్ నేషనల్ పార్టీ  56
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ  8
డియూపి 8
ఇతరులు 15
రాణి ఎలిజబెత్  అధికారిక ప్రకటన అనంతరం ఈనెల 27వ తేదీన కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది.

కాగా మొత్తం 650 స్థానాలకు, కన్జర్వేటివ్ పార్టీ 316,  ప్రతిపక్ష లేబర్ పార్టీ  239  స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

మరిన్ని వార్తలు