నోట్ల రద్దును దేశం స్వాగతించింది

2 Dec, 2016 11:28 IST|Sakshi
నోట్ల రద్దును దేశం స్వాగతించింది

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్  ప్రక్రియను  దేశం స్వాగతించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  ప్రజలు అద్భుతంగా సహకరించాన్నారు. సెక్యూరిటీ కరెన్సీముద్రణ కొంత ఎక్కువ సమయంతో  కూడుకున్న పని అనీ,  అయినా నగదు సరఫరాలో ఆర్ బీఐ  చురుకు గా పనిచేస్తోందని  ఆర్థికమంత్రి  భరోసా ఇచ్చారు.

మానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భారతదేశ వ్యాపార  భారీగా ప్రభావితం  కానుందన్నారు.  డిజిటల్ అయిన పన్ను వ్యవస్థ  మరింత పటిష్టమవుతుంది.  ఇక ప్రతీ చిన్న లావాదేవీ  నమోదుకావడంతో పన్ను పునాది విస్తృత  మవుతుందన్నారు. ఫలితంగా  పన్ను రేట్లు  దిగిరానున్నాయని జైట్లీ ప్రకటించారు.   పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార పరిధి, వాణిజ్యం  వృద్ధిని నమోదు చేస్తుందని, కానీ  పేపర్ కరెన్సీ క్రమంగా తగ్గుతుందని చెప్పారు.  రీమానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా  డిసెంబర్ 30 తర్వాత కాగితపు కరెన్సీ తగ్గించనున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ప్రజల షాపింగ్ తీరు మారిపోనుందని  చెప్పారు. ఈ త్రైమాసిక అంతరాయాన్ని  అంచనా వేయడం కష్టం,  కానీ  దీని ప్రభావం  కొంత కాలమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు.

డీమానిటైజేషన్ ప్రభావంతో రబీ విత్తనాలు గత ఏడాది కంటే ఎక్కువగా లభ్యమవుతున్నారు. ఆటో అమ్మకాల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోందన్నారు. స్వల్పకాలంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలు  భారీగా ఉండనున్నట్టు జైట్లీ తెలిపారు.  ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్తికవ్యవస్థగా భారత్ తన హవానుకొనసాగిస్తుందన్నారు. అధిక జీడీపీ, క్లీనర్ జీడీపీ సహేతుకమైన వడ్డీ రేట్ల సహకారంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  భారత్ మారిందన్నారు.

మరిన్ని వార్తలు