నిఠారీ కేసులో కోలీకి డెత్ వారెంట్

4 Sep, 2014 11:06 IST|Sakshi

ఘజియాబాద్: నిఠారీ వరుస హత్యల కేసులో 14ఏళ్ల రింపా హాల్దర్ దారుణ హత్యకు సంబంధించి దోషిగా తేలిన సురీందర్ కోలీకి ఘజియాబాద్ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో దోషికి చట్టపరమైన అవకాశాలన్నింటినీ సురీందర్ కోలీ ఇప్పటికే వినియోగించున్నందున అతనికి మరణశిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతుల్ కుమార్ గుప్తా తీర్పు చెప్పినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. 

మిగిలిన నాలుగు హత్యకేసుల్లో కూడా కోలీకి మరణశిక్ష పడినందున శిక్షల అమలుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వారెంట్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి పంపించారు.  సురీందర్ కోలీని ఈ నెల 12న ఉరితీయాలని కోర్టు నిర్ణయించిందని,  శిక్ష అమలు చేసే తేదీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం తుదిగా ఖరారు చేస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు