ఆదాయాలు పుంజుకుంటాయ్: క్రిసిల్

3 Jan, 2014 02:20 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ ఆదాయ వృద్ధి మూడవ క్వార్టర్(అక్టోబర్-డిసెంబర్)లోనూ బాగుంటుం దని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్  పేర్కొంది. వరుసగా 9 త్రైమాసికాలు అసలు వృద్ధిలేకపోగా క్షీణతను నమోదుచేసుకున్న ఆదాయాలు, సెప్టెంబర్ క్వార్టర్‌లో తిరిగి ‘యూ’ టర్న్ తీసుకున్నాయి. రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందిన ఎగుమతి ఆధారిత రంగాలు దీనికి కారణం. అయితే డిసెంబర్ క్వార్టర్ నుంచీ మరిన్ని రంగాల్లో పురోగతి ధోరణి కనబడుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్(రీసెర్చ్) ముకేశ్ అగర్వాల్ తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, జౌళి వంటి ఎగుమతి ఆధారిత సంస్థల నుంచే కాకుండా, దేశీయ వినియోగ ఆధారిత రంగాల నుంచి తగిన పురోగతి కనిపిస్తోందన్నారు. మంచి వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం డిమాండ్ వృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు