శరణార్థులపై పెప్పర్ స్ప్రే ప్రయోగం

24 Sep, 2015 11:04 IST|Sakshi
శరణార్థులపై పెప్పర్ స్ప్రే ప్రయోగం

తమ దేశంలోకి వెల్లువలా తరలివస్తున్న శరణార్థులను నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో తాము పెప్పర్ స్ప్రే ఉపయోగించినట్లు క్రొయేషియా పోలీసులు వెల్లడించారు. ఒపటోవా, తూర్పు క్రొయేషియా ప్రాంతాల్లో ఇలా చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధఙ జెలెనా బికిక్ తెలిపారు. శరణార్థులు బస్సులో ఎక్కేందుకు ఒకరిని ఒకరు విపరీతంగా తోసుకుంటున్నారని, ఈ తోపులాటను ఆపేందుకు పోలీసులకు మరో ప్రత్యామ్నాయం లేక పెప్పర్ స్ప్రే ఉపయోగించారని చెప్పారు.

ఈ తొక్కిసలాటలో పిల్లలు ఇరుక్కుపోకుండా ఉండాలనే అలా చేశామంటున్నారు. అయితే, ఇద్దరు పిల్లల మీద కూడా పొరపాటున ఈ స్ప్రే పడిందని ఆమె చెప్పారు. వెంటనే రెడ్ క్రాస్ వలంటీర్లు ఆ పిల్లలను ఆస్పత్రికి తరలించారు. గడిచిన వారంలో దాదాపు 44 వేల మంది శరణార్థులు క్రొయేషియాకు వచ్చారని క్రొయేషియా హోంశాఖ మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు