సీఆర్పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రదాడి

13 Jun, 2017 19:43 IST|Sakshi
సీఆర్పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రదాడి

శ్రీనగర్‌: కల్లోల జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. త్రాల్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై మంగళవారం గ్రెనేడ్లతో దాడి జరిపారు.

ఈ ఘనటలో తొమ్మిది మంది జవాన్లు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి క్యాంప్‌ మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నదని, దాడికి పాల్పడిన ముష్కరుల కోసం​ వేట కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు