ముంబై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో నిందితులు !

23 Aug, 2013 11:48 IST|Sakshi
ముంబై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో నిందితులు !

దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన మహిళ ఫోటో జర్నలిస్ట్ (23)పై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు.

 

ఆ ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు. వారిని తమదైన శైలీలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం చేసిన నిందితుల వివరాలను మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ వివరించారని ఈ సందర్బంగా పోలీసు అధికారులు తెలిపారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన మహిళ జర్నలిస్ట్ జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అత్యాచారం వల్ల ఆమె శరీరంలో అంతర్గంతంగా గాయాలు అయ్యాయని వైద్యులు వివరించినట్లు చెప్పారు.  


గురువారం సాయంత్రం మహాలక్ష్మీ పరిసర ప్రాంతంలో శక్తి మిల్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఆమె స్నేహితుడితో కలసి ఫోటో తీసుకుంటున్న మహిళ జర్నలిస్ట్ను స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడిని కట్టిపడేశారు. అనంతరం ఆ ఐదుగురు యువకులు ఆ మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు