తీపి కబురందించిన ఐసీఐసీఐ

3 Nov, 2016 15:47 IST|Sakshi
తీపి కబురందించిన ఐసీఐసీఐ

ముంబై: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ప్రయివేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ  కూడా తీపి కబురు అందించింది. నవంబరు 2 నుంచి హోం లోన్లపై  వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది.  వార్షిక ఎంసీఎల్ ఆర్ 15  బీపీఎస్ పాయింట్లను  తగ్గిస్తున్నట్టు గురువారం  ప్రకటించింది.  ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్ సైట్  ప్రకారం వడ్డీరేటును 9.30 శాతం నుంచి 9.15  శాతానికి తగ్గించింది.  అదే సమయంలో వేతన వర్గాలకు 9.35శాతంగా ఉన్న వడ్డీరేటు  సవరించిన కొత్త రేటు  ప్రకారం  ప్రస్తుతం 9.20 శాతంగా ఉండనుంది.

ముఖ్యంగా మహిళా ఖాతాదారులకు 9.15శాతం వడ్డీరేటులో గరిష్టంగా రూ.75 లక్షల వరకు  గృహరుణాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే  తాజాగా బ్యాంక్ టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించిన ఐసీఐసీఐ వేతన జీవులకు మరో  వెసులుబాటు కల్పించింది.  సాలరీడ్ ఎంప్లాయిస్ కి( వేతన జీవులకు)  రుణ వడ్డీరేటును 9.20  శాతంగా ప్రకటించింది.

కాగా  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ పేరుతో గృహ రుణాలపై వడ్డీ రేట్లను తాజాగా తగ్గించింది. 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో  వడ్డీ రేటు 9.1 శాతానికి దిగి  ఆరేళ్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.  ఇతర  రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను  9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు  ప్రకటించడంతో పాటుగా ప్రాసెసింగ్‌ ఫీజును  రూడా మాఫీ చేసిన  సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు