మిస్త్రీని నిలదీసిన వాటాదారులు

15 Aug, 2013 02:57 IST|Sakshi

ముంబై: టాటా స్టీల్ చైర్మన్  సైరస్ మిస్త్రీకి తొలిసారి ఆ సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటాదారుల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. టాప్ మేనేజ్‌మెంట్‌లో జీతాలు పెరుగుతున్నప్పటికీ వాటాదారులకు చెల్లించే డివిడెండ్ తగ్గడంపై నిరసన వ్యక్తమైంది. 2007-08లో షేరుకి రూ. 16 డివిడెండ్‌ను చెల్లించగా, ప్రస్తుతం రూ. 8కి పడిపోవడంపై ఒక వాటాదారుడు సైరస్‌ను నిలదీశాడు. అయితే ప్రపంచస్థాయిలో  స్టీల్‌కు డిమాండ్ పడిపోయిందని, దీంతో కంపెనీ లాభాలు సైతం భారీగా క్షీణించాయని సైరస్ వివరణ ఇచ్చారు.  ఇదే సమయంలో కంపెనీ విస్తరణ బాటలో ఉన్నందువల్ల  కొంత డివిడెండ్‌ను తగ్గించాల్సి వచ్చిందని వివరించారు.

>
మరిన్ని వార్తలు