కాంగ్రెస్ లో చేరిన పాప్ సింగర్ దలేర్ మెహందీ!

6 Sep, 2013 22:00 IST|Sakshi
న్యూఢిల్లీ:
పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ తోపాటు మరో నలుగురు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో   బీఎస్పీకి చెందిన బదార్పూర్ ఎమ్మెల్యే రాంగోపాల్ సింగ్ నేతాజీ, ఆర్ జేడీ ఎమ్మెల్యే ఆసీఫ్ మహ్మద్ ఖాన్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామ్ సింగ్ బిధురీ, బీజేపీకి చెందిన మరో నేత ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొంత మంది నేతలు ఉత్సాహం చూపుతున్నారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు జై ప్రకాశ్ అగర్వాల్ తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కూడా తమతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వచ్చే నవంబర్ లో ఢిల్లీలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో రాజకీయపార్టీల నేతల ఫిరాయింపులు ఊపందుకున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 27 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్-నీల్సన్ మూడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. 

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు