దానం, అంజన్న అరెస్ట్

9 Oct, 2015 11:44 IST|Sakshi
దానం, అంజన్న అరెస్ట్

హైదరాబాద్ : తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని ఆపివేశారు. ఆగ్రహించిన దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు  వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు.

రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని కాంగ్రెస్తోపాటు వివిధ రాజకీయ పక్షాలు అక్టోబర్ 10వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. అనంతరం రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్లతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు