అఖిలేష్కు నితీష్ సక్సెస్ మంత్రా..

18 Oct, 2016 14:43 IST|Sakshi
పట్నా : "బాబూ అఖిలేష్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచి..తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అయితే నేను చెప్పినది పాటించు.."అంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్కు  అద్బుతమైన సలహా ఇచ్చారు. బిహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్లోనూ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తే, ఎన్నికల్లో విజయం వెతుకుంటూ వస్తుందని, తన సక్సెస్ మంత్రకూడా అదేనని నితీష్ పేర్కొన్నారు.
 
గతేడాది నవంబర్ లో హోరాహోరీగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ప్రధాన కారణం సంపూర్ణ మద్య నిషేధ హామీనేనని నితీష్.. అఖిలేష్ కు  చెప్పారు. అదే మంత్రాన్ని ఇప్పుడు యూపీలోనూ అమలుచేయాలని సూచించారు. ఇప్పటికే సమాజ్వాద్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో సీఎం అఖిలేష్, తన తండ్రి ములాయం సింగ్, బాబాయి శివపాల్ యాదవ్ ల నుంచే మద్దతు కోల్పోతున్నారు.
 
అఖిలేష్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో తన ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్ను ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. అంతేకాక వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది కూడా ములాయం సింగ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో  అఖిలేష్కు నితీష్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. యూపీలో మద్య నిషేధం అమలు చేపడితే, ఎన్నికల్లో గెలవడానికి ఎవరి సపోర్టు అక్కర్లేదని నితీష్ పేర్కొన్నారు. మహిళా ఓటర్ల మద్దతు పొందవచ్చని,  దీంతో తన ఖాతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవచ్చని అఖిలేష్కు నితీష్ చెప్పారు. రిస్క్ లేకుండా దేన్ని సాధించలేవని, దేనినైనా నీవు ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు, పెద్ద పెద్ద రాజకీయ లక్ష్యాలను సాధించలేవని నితీష్ హెచ్చరించారు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు