'ముద్దుకు గెడ్డం అడ్డమంది అందుకే...'

1 Apr, 2015 09:43 IST|Sakshi
'ముద్దుకు గెడ్డం అడ్డమంది అందుకే...'

లాస్ ఏంజిల్స్ : మాజీ పుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడు గెడ్డంతో ఉండే అతడు ఈ సారి న్యూ లుక్లో కనిపించాడు. ఎంతో ముచ్చటగా  లైట్గా గెడ్డం పెంచుకునే బెక్ హమ్  ఇప్పుడా గెడ్డాన్ని తీసి నున్నగా తయారైయ్యాడు. ఇదేమి చెప్మా అంటే అసలు విషయాన్ని బాబుగారు సిగ్గు పడుతూ సెలవిచ్చాడు.

భార్యామణి విక్టోరియాను బెక్ హమ్ ఓ ముద్దు ఇవ్వమని కోరాడంటా. అందుకు ఆమె ససేమిరా అంది. ఎందుకని అడిగితే గెడ్డం అడ్డంగా ఉందని బదులిచ్చిందట. అంతేకాకుండా గెడ్డం తీసే వరకు ముద్దు పెట్టనని కరాఖండిగా చెప్పిందట. దాంతో భార్య ముద్దు కోసం డేవిడ్ బెక్ హమ్ గెడ్డం త్యాగం చేసేశాడు.

అంతేకాకుండా పనిలో పనిగా భార్య విక్టోరియాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా నిజాయితీగా ఉంటుందని చెప్పాడు. తన భార్య ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెబుతుందని మురిసిపోతున్నాడు. ఆమె తనకు ఇచ్చే సలహాలు ఎంతో దార్శనికతో కూడి ఉంటాయని పొగడ్తలు కురిపించాడు. విక్టోరియా వ్యాపార రంగంలో దూసుకుపోతుందని సంబరపడుతున్నాడు. ఆమె చెప్పే సలహాలు 99 శాతం పాటిస్తానని బెక్ హమ్ మురిసిపోతు చెప్పటం విశేషం.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు