వెయ్యి దాటిన ‘హజ్’ మృతుల సంఖ్య

28 Sep, 2015 01:55 IST|Sakshi

- మృతుల్లో 35 మంది భారతీయులు
మినా:
హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య 35కి చేరింది. తాజాగా గుర్తించిన మృతులు జార్ఖండ్, యూపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారని అధికారవర్గాలు తెలిపాయి. హజ్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సౌదీ రాజు సల్మాన్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు