'రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి'

11 Jan, 2014 14:39 IST|Sakshi
'రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి'

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు స్వరం పెంచుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ సంతకాలతో కూడిన మూడు పేజీల లేఖను వారు ఫ్యాక్స్ చేశారు.

మరోవైపు ప్రధాని అభ్యర్థి అంశం కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలకు, అభిప్రాయ భేదాలకు వేదికగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేయాలని పార్టీలో మెజారిటీ వర్గం కొంతకాలంగా పదేపదే డిమాండ్ చేస్తున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నిన్న మీడియాముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు