మహిళలకు ఢిల్లీ ఇప్పటికీ ప్రమాదకరమే!

31 Aug, 2016 09:21 IST|Sakshi
మహిళలకు ఢిల్లీ ఇప్పటికీ ప్రమాదకరమే!

మహిళలకు ఏమాత్రం భద్రత లేని నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన నేరాలు 5 శాతం తగ్గినా, రాజధానిలో మాత్రం మహిళలకు భద్రత పూర్తిగా కొరవడింది. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు దేశవ్యాప్తంగా కొంతవరకు తగ్గినట్లు జాతీయ నేరాల లెక్కల్లో తెలిసింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో అత్యాచారాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని ఈ వివరాల ద్వారా తేలింది.

దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాలు 4 శాతం పెరిగాయి. సగటున దేశంలో ఇతర ప్రాంతాల కంటే మహిళలు అత్యాచారాలకు గురయ్యే ప్రమాదం ఢిల్లీలోఏ 4 రెట్లు ఎక్కువ అని ఇప్పటికే చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 2015 సంవత్సరంలో 32,127 హత్యలు, 34,651 అత్యాచారాలు, 36,188 దోపిడీలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇవి 5 శాతం తగ్గాయి. 2014లో మహిళలపై 3.37 లక్షల నేరాలు జరగ్గా, 2015లో 3.27 లక్షలు జరిగాయి. అయితే పిల్లలపై నేరాలు మాత్రం 89 వేల నుంచి 94 వేలకు పెరిగాయి. పోలీసు దళాల్లో సిబ్బంది సంఖ్య తగినంతగా లేకపోవడంతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపించడం లేదని అంటున్నారు.

మరిన్ని వార్తలు