సునందాపుష్కర్‌ కేసు: స్వామికి చుక్కెదురు!

30 Aug, 2017 13:59 IST|Sakshi
సునందాపుష్కర్‌ కేసు: స్వామికి చుక్కెదురు!

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ భార్య సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్యస్వామికి చుక్కెదురైంది. సునందా పుష్కర్‌ మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్న సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది.

ఈ కేసు విచారణకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఉంటే రెండువారాల్లోగా సమర్పించాలని, ఆలోగా ఏమీ సమర్పించకపోతే.. ఒక ఈ కేసు విషయాన్ని తామే చూసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి విషం వల్ల సునందపుష్కర్‌ మరణించిందని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తే.. ఇంకా అది ఏ తరహా విషమో విశ్లేషించడంలో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్‌బీఐ, ఇతర ఏజెన్సీల చేత ఫోరెన్సిక్‌ దర్యాప్తును విశ్లేషించడం.. కేసు దర్యాప్తులో జాప్యం చేయడమేనని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు