ఆ క్యాబ్లు గ్యాస్తోనే నడవాలి!

15 Oct, 2015 18:09 IST|Sakshi
ఆ క్యాబ్లు గ్యాస్తోనే నడవాలి!

భారత రాజధాని ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబ్లు కేవలం గ్యాస్తో మాత్రమే తిరగాలంటూ హైకోర్టు డెడ్ లైన్ విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు యాప్ ఆధారంగా ఫ్యూయెల్తో తిరిగే క్యాబ్లు... నాచురల్ గ్యాస్ వినియోగంతో నడపాలని కోర్టు ఆదేశించింది. మార్చి 2016 నాటికి డీజిల్ క్యాబ్లు రోడ్లపై నడిచేందుకు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఓలా, ఊబర్ వంటి కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాబ్లు ఇచ్చిన గడువు లోపల తమ తమ క్యాబ్ లను దశలవారీగా డీజిల్ నుంచి గ్యాస్తో నడిచేట్టుగా మార్చుకోవాలని జస్టిస్ మన్ మోహన్ ఆదేశించారు.  ప్రభుత్వం అమలులోకి తేవాలనుకున్న డీజిల్ టాక్సీల నిషేధం ఆచరణాత్మక పరిష్కారం కాదని కోర్టు అభిప్రాయ పడింది.  డీజిల్ క్యాబ్ లు నడుపుతున్న కంపెనీలపై జూలై 29 న ప్రభుత్వం విధించిన నిషేధం నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు