ఆ సిటీలోనే అత్యధిక నేర ఘటనలు

31 Aug, 2016 14:40 IST|Sakshi
క్రైమ్ అనగానే మొదట గుర్తుకొచ్చే సిటీ ఢిల్లీ. కానీ 2015లో ఢిల్లీ తన క్రైమ్ రేటును తగ్గించుకుందట. అయితే దక్షిణ కేరళలోని ప్రముఖ నగరం కొల్లామ్ సిటీ అత్యధిక నేర ఘటనలు నమోదుచేసి క్రైమ్ క్యాపిటల్గా 2015లో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేరళ సిటీలో క్రైమ్ రేటు 1194.3 గా నమోదైంది. దాని తర్వాత ఢిల్లీలో 1066.2, ముంబాయిలో 233.2, కోల్కత్తాలో 170 క్రైమ్ రేటు రికార్డు అయినట్టు తాజా డేటా వెల్లడించింది. 13,257 నేరాలతో కొల్లామ్, ఇండియాలోనే 2 శాతం క్రైమ్స్ను నమోదుచేసిందని తెలిపింది. 
 
మహిళలపై జరుగుతున్న దాడులు కొల్లామ్ నగరంలో 172 ఘటనలు నమోదయ్యాయని, మహిళలపై లైంగిక వేధింపులు 172 కేసులు, భర్త, కుటుంబసభ్యుల చేస్తున్న చిత్రహింసలు 221 కేసులు రికార్డైనట్టు ఈ గణాంకాలు తెలిపాయి. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన నగరాలుగా యాహు ప్రకటించే జాబితాలో కొల్లామ్ టాప్ 20లో ఒకటిగా ఉంటోంది. అల్లర్లు కూడా ఈ సిటీలోనే ఎక్కువగా జరుగుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. రాజకీయ అల్లర్లు, విద్యార్థుల ఘర్షణలలో కేరళనే ప్రథమస్థానంలో నిలుస్తుందని ఎన్సీఆర్బీ డేటా పేర్కొంది. అయితే కులానికి సంబంధించిన ఘర్షణల్లో ఇతర నగరాలతో పోలిస్తే కొల్లామ్లో ఎలాంటి కేసులు రికార్డు కానున్నట్టు నివేదిక వెల్లడించింది.    
మరిన్ని వార్తలు