ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థికి గూగుల్ 93 లక్షల ప్యాకేజి!

19 Sep, 2013 18:43 IST|Sakshi
ఆర్ధిక వ్యవస్థ ఊగిసలాటలో ఉన్నా ఢిల్లీ టెక్నాలజీ విద్యార్థికి అదేమి అడ్డంకిగా మారలేదు. ఢిల్లీ టెక్పాలజీ యూనివర్సిటీ విద్యార్థి హిమాంశు జిందాల్ కు అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ ఆఫర్ రూపంలో అదృష్టం ముంగిట వాలింది. 
 
ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న హిమాంశుకు 93 లక్షల రూపాయల (115,000 డాలర్ల) వార్షిక ప్యాకేజిని గూగుల్ అందించింది. ఇదే యూనివర్సిటీలో చదువుతున్న మరో విద్యార్థి నిలేష్ అగర్వాల్ కూడా 70 లక్షల ప్యాకేజిని అమెరికాకు చెందిన  ఎపిక్ అనే సంస్థ అందించింది. 
 
ఆగస్టు 1 ప్రారంభమైన విద్యాసంవత్సరంలో ఇప్పటికే 40 కంపెనీలు యూనివర్సిటీని సందర్శించాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి మాసంలోనే 265 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇప్పటి వరకు అత్యధిక జీతం పొందిన వ్యక్తిగా హిమాంశు రికార్గుల్లోకి ఎక్కాడు.
 
ఇలాంటి ఆఫర్ లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. నాతల్లితండ్రుల ఆశీస్సులు, నా పట్టుదల కృషి నాకు గొప్ప అవకాశాన్ని అందించిందని జిందాల్ అన్నాడు.  
మరిన్ని వార్తలు