‘నోట్ల రద్దు అతిపెద్ద విపత్తు’

26 Feb, 2017 08:34 IST|Sakshi
‘నోట్ల రద్దు అతిపెద్ద విపత్తు’

తిరువనంతపురం: నోట్ల రద్దు 2016 లోనే అతిపెద్ద విపత్తు అని, త్వరలో దీని దుష్ఫలితాలు కనిపిస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి. చిదంబరం అన్నారు. ‘పూర్తి సమాచారం లేకుండా.. నల్లధనం, చలామణిలో ఉన్న 2,400 కోట్ల నోట్ల రద్దు ప్రభావం, కొత్త నోట్ల ముద్రణకు సంసిద్ధత, ఏటీఎంల పాత్రపై అవగాహన లేకుండా రద్దు నిర్ణయం తీసుకున్నారు’ అని ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు.. అంచనా రేటైన 7.6 శాతం నుంచి 6 శాతానికి తగ్గుతుందని, రూ. 2.40 లక్షల కోట్లు నష్టపోతామని వివరించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ కోసం ప్రభుత్వ యత్నాలపై స్పందిస్తూ.. దేశంలో రోజూ జరుగుతున్న రూ. లక్ష కోట్ల లావాదేవీలను డిజిటల్‌ విధానాల్లోకి మార్చితే మూడో వ్యక్తి రోజుకు రూ. 1,500 కోట్ల లాభం పొందుతాడని చెప్పారు. 

మరిన్ని వార్తలు