కరెన్సీ నోట్ల రద్దు ఇదే తొలిసారి కాదు!

9 Nov, 2016 03:44 IST|Sakshi
కరెన్సీ నోట్ల రద్దు ఇదే తొలిసారి కాదు!

న్యూఢిల్లీ: మన దేశంలో రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించడం ఇదే తొలిసారి కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఇలాంటి సందర్భాలు మన దేశంలో ఉన్నారుు. 1946లో తొలిసారిగా ఈ తరహా చర్య చేపట్టారు. అప్పుడు అమలులో ఉన్న రూ.1,000, రూ.10,000 నోట్లను చలామణి నుంచి తొలగించారు. ఆర్‌బీఐ ఇప్పటివరకు ముద్రించిన అత్యంత విలువైన నోటు రూ.10,000. దీనిని 1938లోనే ముద్రించారు. 1946లో వెనక్కు తీసుకుని మళ్లీ 1954లో ముద్రించారు. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించారు. మళ్లీ 1978 జనవరిలో ఉపసంహరించారు. రూ.500 నోటును 1987 అక్టోబరులో, 1,000 నోట్లను 2000 నవంబరులో మళ్లీ ప్రవేశపెట్టారు. రూ.2,000 నోటును ప్రవేశపెట్టనుండటం మాత్రం ఇదే తొలిసారి.

మనం నిత్యం ఉపయోగిస్తున్న వివిధ మొత్తాల్లోని కరెన్సీ నోట్లు గతంలో అనేక మార్పులకు గురయ్యా రుు. 1967 నుంచి అశోక స్తంభం వాటర్‌మార్క్‌తో నోట్లను ముద్రించడం మొదలుపెట్టారు. నోట్లపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల కింద ఉండే ‘సత్యమేవజయతే’ సూక్తిని 1980లో తొలిసారిగా ముద్రిం చారు. 1987 అక్టోబరులో గాంధీ చిత్రం, అశోకస్తంభాలతో రూ.500 నోటును ముద్రించారు. మహాత్మాగాంధీ సిరీస్ నోట్లను 1996 నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. భద్రతా ప్రమాణాలు పెంచి ఎంజీ సిరీస్ కొత్త నోట్లను 2005 నుంచి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు