ఉప సర్పంచ్పై ఉగ్రవాదుల కాల్పులు

14 Jul, 2015 17:00 IST|Sakshi
ఉప సర్పంచ్పై ఉగ్రవాదుల కాల్పులు

షోపియాన్: భారత సైన్యం, బీఎస్ఎఫ్ బలగాలు, బడా నేతలేకాక గ్రమస్థాయి రాజకీయ నాయకులు సైతం ఉగ్రవాదులకు టార్గెట్ గా మారారు.  జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా తహ్లీపురా ఉప సర్పంచ్ మహమ్మద్ యాకూబ్ మల్లాపై గుర్తుతెలియని ఉగ్రవాదులు మంగళవారం మద్యాహ్నం కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లాను శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 'షోపియాన్ పట్టణంలో ఓ దుకాణం ముందు నిలబడి టీ తాగుతోన్న యాకూబ్ మల్లాను.. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చారు' అని పోలీసులు చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు