ఢిల్లీలో పెరిగిన విద్యుత్ చార్జీలు

13 Nov, 2014 22:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 7 శాతం వరకు పెంచారు. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఈమేరకు గురువారం నిర్ణయం తీసుకుంది. మూడు ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తి మేరకు చార్జీలు పెంచినట్టు డీఈఆర్సీ తెలిపింది.

బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) నుంచి విద్యుత్ వాడుకునే వారిపై 7 శాతం, బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) వినియోగదారులపై 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) వినియోగదారులపై 2.5 శాతం వడ్డించారు.

మరిన్ని వార్తలు