డెస్క్‌ ఉద్యోగాలతో గుండె, నడుముకు చేటు

2 Mar, 2017 21:29 IST|Sakshi
డెస్క్‌ ఉద్యోగాలతో గుండె, నడుముకు చేటు

లండన్‌: అధిక సమయం కూర్చొని పనిచేసే డెస్క్‌ ఆధారిత ఉద్యోగాలతో గుండె జబ్బులతో పాటు, నడుము చుట్టుకొలత పెరిగే ముప్పు ఉందని మరోసారి వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.

రోజులో ఐదు పనిగంటల తరువాత కూర్చొని పనిచేసే ప్రతి అదనపు గంట వల్ల నడుము చుట్టుకొలత రెండు సెంటిమీటర్లు, గుండె జబ్బులు వచ్చే అవకాశం 0.2 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే రోజుకు ఐదు పనిగంటల తరువాత ప్రతి అదనపు గంట పనివల్ల చెడు కొవ్వు పెరిగి, మంచి కొవ్వు తగ్గుతోందని వెల్లడించారు. రోజుకు ఏడు గంటలు నిల్చోవడం, ఏడు మైళ్లు నడవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయొచ్చని సూచించారు. 'మానవ జాతిగా ఎదిగే క్రమంలో మనం రోజంతా కూర్చొని ఉండేలా మన శరీర నిర్మాణం జరగలేదు. వేటగాళ్లు, చెత్తసేకరణ కార్మికుల మాదిరిగా రోజుకు 7-8 గంటలు కాళ్లకు పనిచెబితేనే ఆరోగ్యంగా ఉంటామనే ఆలోచన సరళికి అలవాటు పడ్డాం' అని ప్రొఫెసర్‌ మైక్‌ లీన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు