ఆ వీడియో దేవయానిది కాదు: అమెరికా

5 Jan, 2014 12:37 IST|Sakshi
ఆ వీడియో దేవయానిది కాదు: అమెరికా

వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తున్నట్లుగా వివిధ వెబ్‌సైట్లలో కనిపించిన, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న సీసీటీవీ వీడియో సంచలనం రేపుతోంది. ఆమె రెండు చేతులను వెనక్కు విరిచి, నగ్నంగా పాడుకోబెట్టి తనిఖీ చేస్తున్నట్టు వీడియాలో ఉంది. పురుష భద్రతాధికారులు ఆమెను వేధిస్తున్నట్టుగా అందులో చూపారు. అయితే ఈ వీడియో బూటకమైనదని అమెరికా విదేశాంగ శాఖ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ పేర్కొన్నారు.

‘‘ఆ వీడియో ఎంతమాత్రమూ ఖోబ్రగడేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన, రెచ్చగొట్టేటువంటి కల్పితమైన వీడియో’’ అని చెప్పారు. అమెరికా పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై విదేశాంగ అధికారులు అమెరికా మార్షల్ సర్వీస్ విభాగంతో మాట్లాడారని, ఆ వీడియో దేవయానిది కాదని వారు నిర్ధారించారని మేరీ హార్ఫ్ చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది అమెరికా మార్షల్స్ కాదని, ఆ వీడియోలో కనిపించిన తనిఖీ పద్ధతి కూడా అమెరికా మార్షల్స్ పాటించే విధానంలో లేదని వారు ధ్రువీకరించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు